పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య.. భర్త మరణంతో తీవ్ర మనస్తాపం

నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రసన్న(40) తన 15 ఏళ్ల కుమారుడు, 13 ఏళ్ల కుమార్తెకు అన్నంలో పురుగుల మందు కలిపి ఇచ్చి ఆత్మహత్యకు యత్నించింది. చుట్టుపక్కల వారు గమనించి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కుమార్తె మృతి చెందింది. తల్లి ప్రసన్న, కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ తరలిస్తుండగా ప్రసన్న మృతి చెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్