క్షణికావేశంలో కుమారుడికి నిప్పంటించి తల్లి ఆత్మహత్య

AP: తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లీలాబాలశ్రావణి (35) తన కుమారుడు చంద్రమౌళి (9)ని సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై కాశీతోట సమీపంలోని శివాలయం వద్దకు తీసుకెళ్లి, నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరిపై పెట్రోలు పోసి నిప్పంటించుకుంది. లీలాబాలశ్రావణి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఘటన సమయంలో కుమార్తె ఇంటి బయట ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్