TG: స్కూల్ నుంచి ఇంటికొచ్చిన పిల్లలకు తల్లి విగతజీవిగా కనిపించడంతో 'లే మమ్మీ'.. అంటూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. కరీంనగర్(D) ఎల్లారెడ్డిపేట(M)కు చెందిన కృష్ణహరికి రమ్యతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు లాస్య(5), ప్రణవ్(6), నిషాల్ (5) ఉన్నారు. కృష్ణహరి రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అత్తామామలు పెద్ద కుమారుడితో ఉంటున్నారు. ఈ క్రమంలో రమ్యకు అత్తామామలకు చిన్న ఘర్షణ జరగ్గా మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.