అప్పుల భారంతో పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

AP: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం ఎం.బీరేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక మహాలక్ష్మి (40) అనే మహిళ తన ఇద్దరు పిల్లలకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి, తాను కూడా తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి మహాలక్ష్మితో పాటు ఆమె కుమారుడు రిషి (10) మృతి చెందగా, కుమార్తె శ్రీనిధి (12) అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్