TG: వికారాబాద్(D) పూడూరు(M) మాటుగూడలో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో గొడవపడిన భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకింది. శుక్రవారం ఉదయం భర్త రాజుతో గొడవ పడిన భార్య మమత (30), కూతురు జనశ్రీ (8) కుమారుడు సాకేత్ (4) లను తీసుకుని ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. సోమన్గుర్తి శివారులోని వ్యవసాయ బావిలో శవమై తేలారు. ఇద్దరి మృతదేహాలను బయటకు తీయగా, సాకేత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.