హిందూ మహాసముద్రంలో 'ఫ్రాగిల్' అనే తల్లి డాల్ఫిన్ తన ఐదో కాన్పులో కూడా బిడ్డను కోల్పోయి తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. చనిపోయిన తన రెండు వారాల పిల్ల డాల్ఫిన్ భౌతిక కాయాన్ని నీటిలో మునిగిపోకుండా ఆరు రోజుల పాటు తన వీపుపై మోసుకుని ప్రయాణించింది. పశ్చిమ ఆస్ట్రేలియా తీరం వెంబడి ఈ హృదయ విదారక దృశ్యాలను ఆస్ట్రేలియన్ పరిరక్షణ, పరిశోధన సంస్థ జియోగ్రాఫ్ మెరైన్ రీసెర్చ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఫ్రాగిల్ బాధను చూసి ఆమె గ్రూప్‌లోని మిగతా 14 డాల్ఫిన్లు కూడా ఆమెకు తోడుగా నిలిచి ఓదార్పునిచ్చాయి.