కుమార్తెకు కిడ్నీ దానం చేసిన తల్లి

AP: విశాఖలోని మురళీనగర్‌కు చెందిన గిరీష్, గీతా దంపతులు. వీరికి కుమారుడు అనీష్, కుమార్తె ఐశ్వర్యమీనన్ ఉన్నారు. ఐశ్వర్యకు చిన్నతనం నుంచి వినికిడి సమస్య ఉంది. ఐదేళ్ల క్రితం ఐశ్వర్య కిడ్నీ ఫెయిలయ్యింది. కిడ్నీ కోసం పలువురిని సంప్రదించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో తల్లి గీతా కూతురికి కిడ్నీ దానం చేశారు. ప్రస్తుతం ఐశ్వర్య ఎంబీఏ పూర్తి చేసి, ఉద్యోగం చేస్తున్నారు. ఇవాళ మదర్స్ డే సందర్భంగా తల్లి గీతా తన అనుభవాలను పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్