కూతురిని నడుముకి కట్టుకుని కాలువలో దూకిన తల్లి

AP: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మాచర్ల మండలం తాళ్లపల్లి సమీపంలోని నాగార్జున సాగర్ కుడి కాలువలో ఒక తల్లి తన చిన్నారి కూతురిని నడుముకు కట్టుకుని దూకి ఆత్మహత్య చేసుకుంది. నీటి ఉధృతికి ఇద్దరూ మృతి చెందారు. స్థానికులు మృతదేహాలను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలు లేదా ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్