TG: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వంగమర్తిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నెలల వయసున్న కుమార్తెతో కలిసి తల్లి వాణి (29)బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కొన్ని నెలలుగా వాణి మానస్థిక స్థితి బాలేదని పోలీసులు తెలిపారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది బావిలో గాలించి ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. పాప మృతదేహం ఇంకా దొరకలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలు తాత్కాలికంగా నిలిపేశారు.