ప్రియుడి కోసం కవల కుమారుల్ని చంపిన తల్లి

రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా బదెస్రా గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొంతకాలం క్రితం తన భర్త చనిపోవడంతో ప్రీతి చౌదరి తన పుట్టింట్లోనే ఉంటోంది. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో ప్రీతి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి బంధాన్ని కవలలైన వినయ్, విష్ణు వ్యతిరేకించారు. తనను అంగీకరించని పిల్లలు తనకు వద్దని ప్రియుడు చెప్పాడు. దీంతో ఇంట్లో నిద్రపోతున్న సమయంలో వినయ్, విష్ణుల గొంతు కోసి చంపింది. ఇందుకు పెద్ద కుమారుడు(16) కూడా సహకరించాడు. ఈ కేసు మిస్టరీని పోలీసులు ఆరు గంటల్లోనే ఛేదించారు. ప్రీతి సహా ఆమె పెద్ద కొడుకు, ప్రియుడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕