నీళ్ల బకెట్‌లో ముంచి కవల పిల్లలను చంపిన కన్న తల్లి

బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. లేకలేక పుట్టిన కవల పిల్లలను కన్న తల్లే నీళ్ల బకెట్‌లో ముంచి చంపింది. దొడ్డబళ్లాపురం పరిధిలోని తలఘట్టపురకు చెందిన ఉమాదేవి (42), రామలింగప్ప (50) దంపతులు.  రామలింగప్ప వ్యాపారం చేస్తుంటారు. ఈ దంపతులకు మే 5న ఒక కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. అయితే పిల్లలు పుట్టాక ఉమాదేవి మానసిక అనారోగ్యానికి గురైంది. పిల్లలను పోషించడంలో కూడా తీవ్ర ఇబ్బందులు పడసాగింది. ఈ నేపథ్యంలో మంగళవారం పిల్లలను బకెట్‌లో ముంచి ప్రాణాలు తీసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్