TG: ఆస్తి కోసం కన్నతల్లిని చంపిన కొడుకును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లోని మల్లారెడ్డి, రాధికారెడ్డి దంపతుల చిన్న కుమారుడు కార్తీక్ మద్యానికి బానిసయ్యాడు. డీఅడిక్షన్ సెంటర్‌లో చేర్చినా అతడిలో మార్పు రాలేదు. అక్కడ నుంచి తిరిగొచ్చాక రూ.100 కోట్ల విలువైన భూమిని తనకు ఇచ్చేయాలని తల్లిదండ్రులను వేధించసాగాడు. సోమవారం నిద్రిస్తున్న తల్లిని కత్తితో 9 చోట్ల పొడి చంపేశాడు.