యూపీలో ఓ వివాహిత మహిళ మేనల్లుడితో పారిపోయిన ఘటన చివరికి విషాదంగా మారింది. ఢిల్లీకి చెందిన పూజా మిశ్రా.. తన భర్త లలిత్ కుమార్ మిశ్రా మేనల్లుడు అలోక్ మిశ్రాతో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండానే ఇద్దరూ బరేలీకి వెళ్లి సహజీవనం చేశారు. అయితే 7 నెలల తర్వాత విభేదాలు తలెత్తడంతో విషయం పెద్దల దాకా వెళ్లింది. చివరికి పోలీస్ స్టేషన్‌లో అలోక్ ఆమెను తిరస్కరించడంతో షాక్‌కు గురైన పూజా మిశ్రా బ్లేడ్‌తో మణికట్టు కోసుకుంది. ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.