నదిలో మునిగిపోయిన కొడుకు.. కాపాడాలంటూ వేడుకున్న తల్లి (వీడియో)

గుజరాత్‌లోని వడోదరలో బ్రిడ్జి కూలిన ఘటన పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో వాహనాలు నీటిలో పడి అందులోని 13 మంది చనిపోయారు. ఇదే క్రమంలో ఓ కారు కూడా వంతెన పైనుండి పడింది. దీంతో కారు అద్దం పగలగొట్టుకొని ఓ మహిళ బయట పడగా.. మిగతా వారు అందులోనే చిక్కుకుపోయారు. అయితే తన కొడుకు నీటిలో మునిగిపోతున్నాడని, కాపాడాలంటూ ఆ తల్లి వేడుకుంటున్న దృశ్యం కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్