E20 పెట్రోల్‌పై వాహనదారుల ఆందోళన

దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ వినియోగం పెరగడంతో వాహనదారులు, కొన్ని సంఘాల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 2023 కంటే ముందు కొన్న పాత వాహనాల్లో E20 పెట్రోల్ వాడటం వల్ల ఇంజిన్లు పాడవుతున్నాయని, పైపులు లీక్ అవుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయం లేకుండా E20ని బలవంతంగా రుద్దుతోందని కొందరు నిరసనలు చేపట్టారు. E20 వల్ల మైలేజ్ తగ్గినా ధర తగ్గించకపోవడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు, ఇథనాల్ తయారీకి చెరకు, వరి వంటి పంటలను వాడటం వల్ల భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్