TG: హైదరాబాద్‌లోని ఓ మల్టీప్లెక్స్‌కు జిల్లా వినియోగదారుల కమిషన్ రూ.75 వేల జరిమానా విధించింది. 2025 జూన్ 20న ‘కుబేర’ సినిమా కోసం ఓ ప్రేక్షకుడు రాత్రి 10:35 గంటల షోకు రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. నిర్ణీత సమయానికి థియేటర్‌లో కూర్చున్నా.. 10:52 వరకు యాడ్స్, ట్రైలర్లు ప్రదర్శించడంతో సినిమా 22 నిమిషాలు ఆలస్యమైంది. దీనిపై ఆయన కమిషన్‌ను ఆశ్రయించారు. ప్రేక్షకుల సమయాన్ని వృథా చేయడం సేవల్లో లోపమని పేర్కొన్న కమిషన్.. రూ.20 వేలు పరిహారం, రూ.5 వేలు కోర్టు ఖర్చులు చెల్లించాలని, మరో రూ.50 వేలు సంక్షేమ నిధిలో జమ చేయాలని ఆదేశించింది.