బీఆర్ఎస్ నేత హరీశ్​రావుపై ఎంపీ చామల ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీఆర్ఎస్ నేత హరీశ్​రావు పని అని ఎంపీ చామల కిరణ్​ కుమార్​ రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్​లో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్​ ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్​ నేతలు, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమా అని సవాల్​ విసిరారు. బీజేపీ కూడా 2014 నుంచి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ రెండు పార్టీల విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్