AP: కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆలూరు-4 ఎంపీటీసీ లక్ష్మీదేవి మృతి చెందారు. అధిక రక్తపోటుతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. ఎంపీటీసీ లక్ష్మీదేవి మృతిపట్ల టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.