AP: తన కోరిక తీర్చాలంటూ మహిళా VRO ఇంటికెళ్లిన MROకు బడితె పూజ జరిగింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నివాసం ఉండే మహిళా వీఆర్‌ఓను కొన్నేళ్లుగా అతడు లైంగికంగా వేధిస్తున్నాడు. 'మీ ఇంటికొస్తా, అడిగింది ఇస్తావా? కోడికూర వండిపెడతావా?' అని మెసేజ్‌లు పెట్టాడు. బుధవారం బరితెగించి MRO ఆమె ఇంటికి వెళ్లాడు. షర్ట్ విప్పి తన కోరిక తీర్చాలంటూ బలవంతం చేయబోయాడు. విషయం తెలుసుకున్న VRO తల్లి అతడిని చితకబాదింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.