AP: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని బొందిమడుగుల గ్రామంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్ దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం వాకింగ్ చేస్తుండగా దుండగులు ట్రాక్టర్‌తో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆయన, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. ఈ ఘటనపై దళిత సంఘాలు శుక్రవారం రాత్రి కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.