ICTకి ముకేశ్ అంబానీ రూ.151 కోట్ల విరాళం (వీడియో)

తాను చదువుకున్న ముంబయిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ICT)కి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ రూ.151 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ ఎంఎం శర్మ జీవిత చరిత్ర ‘డివైన్‌ సైంటిస్ట్‌’ పుస్తకావిష్కరణ సభకు హాజరైన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ మొత్తాన్ని దేనికైనా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. 1970లో ఐసీటీ నుంచి ముకేశ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్