రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నటుడు రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ సాధించిన అసాధారణ విజయంపై హర్షం వ్యక్తంచేశారు. జియో స్టూడియోస్ సాధించిన విజయాలను అభినందిస్తూ ఆయన లేఖ రాశారు. 2024లో ‘స్త్రీ 2’, 2025లో ‘ధురంధర్’, 2026లో ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రాలతో వరుసగా మూడేళ్లపాటు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలను అందించి అరుదైన మైలురాయిని అందుకున్నట్లు తెలిపారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్స్ బాక్సాఫీస్ కలెక్షన్లలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణలో సరికొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేశాయని పేర్కొన్నారు.