తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న ముఖేశ్ అంబానీ (వీడియో)

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొన్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనను సత్కరించి, వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్