AP: బహు భాషా విధానం భారత దేశానికి మంచిదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇందుకు తమిళనాడు కూడా మినహాయింపు కాదన్న జనసేనాని తెలిపారు. ‘జయ కేతనం’ సభలో ప్రసంగాన్ని కూడా పవన్ తమిళ స్లోగన్‌తోనే మొదలు పెట్టడం విశేషం. అలాగే, తెలంగాణ కవుల మాటలను చెపుతూనే, మరాఠా యోధుల గురించి కూడా వివరించారు. ఈ వ్యాఖ్యలు తమిళుల నిరసనకు కౌంటర్ ఇచ్చినట్లు అని రాజకీయంగా చర్చ జరుగుతోంది.