రూ.189కే మల్టీప్లెక్స్ మూవీ టిక్కెట్.. PVR INOX కొత్త ప్లాన్

PVR INOX సంస్థ రూ.189కే టికెట్ ధరతో 'స్మార్ట్ సినిమా' థియేటర్లను ప్రారంభించనుంది. రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 300 స్క్రీన్లను చిన్న పట్టణాలను లక్ష్యంగా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ థియేటర్లలో తక్కువ ధరకే స్నాక్స్, VR గేమ్స్, ఫోటో బూత్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. తక్కువ ఖర్చుతోనే మల్టీప్లెక్స్ అనుభూతిని అందించే ఈ నిర్ణయంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్