రికెల్టన్ విధ్వంసం.. ముంబై భారీ స్కోర్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. రికెల్టన్ 55 బంతుల్లో 123* పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. విల్‌ జాక్స్‌ 46, హార్దిక్‌ పాండ్య 31, నమన్‌ ధీర్‌ 22 పరుగులు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో ప్రఫుల్‌ హింగే 2 వికెట్లు తీయగా, నితీశ్‌ రెడ్డి, ఎషాన్‌ మలింగ, సకీబ్‌ హుస్సేన్‌ తలో వికెట్ సాధించారు. దీంతో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయ లక్ష్యం 244గా నిలిచింది.

సంబంధిత పోస్ట్