TG: రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్ల పాలక మండళ్ల ఎన్నికలను ఒకే విడతలో ఫిబ్రవరి 14న నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా పోలింగ్ స్టేషన్ల వారీగా తుది ఓటరు జాబితా ఈ నెల 16న ప్రదదర్శించాలని SEC ఆదేశించింది. దీని ప్రకారం ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 17న ప్రకటించే అవకాశం ఉంది. BCలకు 32% రిజర్వేషన్లు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం 2,996 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.