పార్టీ మారిన మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌‌పై వేటు

TG: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌ మాధవికి బిగ్ షాక్ తగిలింది. పార్టీ మారిన  మాధవిపై జిల్లా ఎన్నికల అధికారి వేటు వేశారు. 8వ వార్డు కౌన్సిలర్‌ మాధవి నరేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించారు. పార్టీ విప్‌ జారీ చేసినా మాధవి ఉల్లంఘించిందని డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో వేటు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్