నర్సుపై హత్యాచారం కేసు.. ఎన్‌సీడబ్ల్యూ సుమోటో విచారణ

TG: పహాడీషరీఫ్‌ పరిధిలోని తుక్కుగూడలో 21 ఏళ్ల నర్సుపై హత్యాచారం కేసుపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా విచారణ జరపనుంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ లేఖ రాశారు. నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కేసులో వేగవంతమైన దర్యాప్తు చేయాలని NCW సూచించింది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని ఆదేశించింది. ఈ ఘటనపై వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని పోలీసులకు సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్