ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. 11 ఏళ్ల బాలికను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. బుధవారం ఒక సంచిలో బాలిక మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనలో పొరుగున ఉన్న కౌషల్ అనే వ్యక్తితో పాటు, మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది. హత్యకు గురైన బాలిక మంగళవారం నుంచి కనిపించకుండా పోయింది. హత్యకు కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.