మహారాష్ట్రలోని పుణెలో మూడేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో 65 ఏళ్ల భీమ్‌రావ్‌కు ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించింది. 2026 మే 1న నస్రాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో, నిందితుడు చిన్నారిని నిర్మానుష్య ప్రదేశంలోని పశువుల షెడ్డులోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, బండరాయితో కొట్టి హత్య చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ ఈ కేసును స్వయంగా పర్యవేక్షించారు. పుణె ఫాస్ట్-ట్రాక్ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది.