మాజీ సర్పంచ్ హత్య.. వెలుగులోకి కీలక విషయాలు

TG: జోగులాంబ గద్వాల్ జిల్లా నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమా రాయుడు హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, పాత కక్షల నేపథ్యంలో మిల్లు వీరన్న అలియాస్ కుర్వ వీరన్న పక్కా ప్లాన్‌తో హత్య చేశాడని తేల్చారు. ఈ నెల 21న జాంపల్లి సమీపంలో బొలెరో వాహనంతో ఢీకొట్టి భీమా రాయుడిని హత్య చేశారు. కుటుంబ సభ్యుల అనుమానంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా సుపారీ మర్డర్ వెలుగులోకి వచ్చింది. వీరన్న, అతని కుమారుడు సురేందర్, 8 మంది సుపారీ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. హత్య కోసం రూ.25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్