బిడ్డ పుట్టిన మొదటి అరగంటలోపు తల్లులకు వచ్చే పాలను ముర్రుపాలు అంటారు. వీటిని బిడ్డకు తప్పకుండా తాగించాలి. వీటిలో శక్తివంతమైన యాంటీబాడీలు ఉంటాయి. ఇవి బిడ్డలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి ఉంటుంది. ముర్రుపాలు బిడ్డకు మొదటి వ్యాధినిరోధక టీకా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పసికందులో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇందులో మాంసకృత్తులు, విటమిన్”ఏ’ ఉంటుంది.