గ్రోక్ ఏఐ చాట్‌బాట్ నిర్వహణకు భారీగా ఖర్చవుతోందని ఎలాన్ మస్క్ వెల్లడించారు. వచ్చే ఆదాయం కంటే నిర్వహణ ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. సర్వర్ ఖర్చులు పెరగకుండా గ్రోక్ వినియోగంపై కఠిన పరిమితులు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ప్రీమియం యూజర్ల వారపు వినియోగ కోటా త్వరగా ముగుస్తోందని పలువురు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.