AP: రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లాలో గణేష్ నవరాత్రుల వేడుకల్లో మత సామరస్యం చాటే సంఘటన చోటుచేసుకుంది. ధర్మవరం పట్టణంలోని గణేశుడి వద్ద ఉంచిన లడ్డూ ప్రసాదాన్ని ముస్లిం దంపతులు చాందిని, మస్తాన్ వలి రూ.1,45,000లకు వేలంపాటలో దక్కించుకున్నారు. ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని భారీ ధరకు లడ్డూను సొంతం చేసుకోవడం ద్వారా వారు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారని స్థానికులు కొనియాడారు.