మటన్ రుచికరమైన ఆహారమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు. మటన్ ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ B12 లను అందించి కండరాల దృఢత్వానికి, రక్తహీనత నివారణకు సహాయపడుతుంది. అయితే, అతిగా తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంగా ఉన్నవారు వారానికి 200-350 గ్రాముల మటన్ తీసుకోవచ్చని, కూర లేదా సూప్ రూపంలో వండుకోవడం మంచిదని నిపుణులు సూచించారు. గుండె సమస్యలు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వైద్యుల సలహా మేరకే దీనిని ఆహారంలో చేర్చుకోవాలి.