నా ప్రియుడు సారీ చెప్పాలి: సెల్ టవర్ ఎక్కి యువతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరీదుపూర్ గ్రామంలో, 18 ఏళ్ల యువతి తన ప్రియుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సెల్ ఫోన్ టవర్ ఎక్కింది. ప్రియుడు క్షమాపణ చెప్పకపోతే టవర్ పైనుంచి దూకేస్తానని బెదిరించింది. పోలీసులు రంగంలోకి దిగి, ప్రియుడిని అక్కడికి తీసుకొచ్చి, యువతికి క్షమాపణ చెప్పించారు. ఆ తర్వాత యువతి టవర్ దిగింది. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సంబంధిత పోస్ట్