TG: తాను మాట్లాడిన మాటలను తప్పుదోవ పట్టించారని మాజీ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. 'నాపై ఫాబ్రికేటెడ్ వీడియో తయారు చేశారు. నిన్నటి నుంచి ఆ వీడియోపై హడావిడి చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నట్లున్నారు. అందుకే డీజీపీకి ఫిర్యాదు చేశారు. సింగరేణిలో స్కాంలు చేస్తున్నారు కాబట్టే పోరాటం చేయాలని మాట్లాడా. నేను అరగంట మాట్లాడితే. చిన్న విషయంపై రాద్ధాంతం చేస్తున్నారు' అని అన్నారు.