TG: హైదరాబాద్ మల్లాపూర్‌లో జరిగిన 18వ హమాలీ ఆవిర్భావ సభలో ఓ BRS అభిమాని పార్టీ పట్ల తనకున్న అమితమైన అభిమానాన్ని చాటుకున్నారు. తన మనవడికి ‘KCR’ పేరు పెట్టానని ఆయన చెప్పడం వైరలవుతోంది. "తెలంగాణ సాధకుడు కేసీఆర్ అంటే గౌరవం. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17న నా మనవడు పుట్టాడు. అందుకే అతనికి కురుమ చరణ్‌రాజ్(KCR) అని పేరు పెట్టా" అని ఆ అభిమాని చెప్పాడు. దీంతో అక్కడే ఉన్న KTR అతడిని అభినందించారు.