అనుమతి లేకుండా నా ఫొటోలు వాడుతున్నారు: హైకోర్టులో ఐశ్వర్యారాయ్

బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన పేరు, ఫోటోలు, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా వాడుతున్నందుకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, వస్తువులపై ఆమె చిత్రాలను దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సీనియర్ అడ్వకేట్ సందీప్ సేథి కోర్టులో వాదిస్తూ.. నకిలీ వెబ్‌సైట్లు, కప్పులు, టీ-షర్టులు వంటి ఉత్పత్తులపై ఆమె చిత్రాలు వాడుతున్నారని తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 15న జరగనుంది.

సంబంధిత పోస్ట్