TG: నిమిష ప్రియ ఉరిశిక్షపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రియకు క్షమాభిక్ష పెట్టాలని కోరారు. అలాగే అమెరికాలో కొత్త పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాను కాపాడాలంటే మూడో పార్టీ కావాలని, ఆల్ అమెరికన్ పార్టీపై అందరి చూపులు ఉన్నాయన్నారు. అమెరికాలో తన కొడుకును సిద్ధం చేస్తున్నానని, తన కొడుకు అమెరికాకు ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.