‘నా భార్య పాములా మారి కాటేస్తోంది’.. పోలీసులకు భర్త ఫిర్యాదు

ఉత్తరప్రదేశ్‌లో సీతాపూర్ జిల్లా లోధ్సా గ్రామం నుండి ఓ అసాధారణ ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. మెరాజ్ అనే వ్యక్తి, తన భార్య నసీమున్ రాత్రి పాములా మారి అతన్ని కాటేందుకు ప్రయత్నిస్తోందని పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏ రాత్రి అయినా ఆమె తనపై దాడి చేసే అవకాశం ఉందని వాపోయాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జిల్లా మెజిస్ట్రేట్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. పోలీసులను దర్యాప్తుకు ఆదేశించింది.

సంబంధిత పోస్ట్