దర్శకుడిగా ఆ కోరిక నెరవేరింది: విశాల్

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై విశాల్ హీరోగా, దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘మకుటం’. ఈ చిత్రం నుంచి ‘నచ్చాకే వచ్చేరా’ అనే సెకండ్ సాంగ్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విశాల్ మాట్లాడుతూ, 'శివ' సినిమా చూసిన తర్వాత దర్శకుడిగా మారాలనే తన కోరిక ఇన్నాళ్లకు 'మకుటం' చిత్రంతో నెరవేరిందని తెలిపారు. ఆర్బీ చౌదరి 99వ ప్రాజెక్ట్ బాధ్యతలను తనకు అప్పగించారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని భావిస్తున్నానని అన్నారు. ఈ సినిమాలో తన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని అంజలి, ఆర్బీ చౌదరి లెగసీని కొనసాగిస్తామని జితిన్ రమేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్