6 నెలల తరువాత వీడిన మిస్టరీ.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

AP: శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు నెలల క్రితం గుర్తుతెలియని శవం మారాల రిజర్వాయర్‌లో దొరికింది. అయితే పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టగా తాజా మిస్టరీని ఛేదించారు. అది వంకరకుంటకు చెందిన రామప్పదని తెలిసింది. భర్త వేధింపులు, వివాహేతర సంబంధం కారణంగా భార్య గంగాభవాని ప్రియుడు గంగాద్రితో కలిసి జూలై 27న ఇంట్లోనే రామప్పను హత్య చేసింది. శవాన్ని చాపలో చుట్టి రిజర్వాయర్‌లో పడేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నిజాన్ని బయటపట్టి గంగాభవాని, గంగాద్రి సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్