ఆసియా క్రీడలకు ముందు భారత్‌కు షాక్ తగిలింది. జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ (NADA) అథ్లెట్ అభిషేక్ పాల్‌కు నోటీసులు జారీ చేసింది. డోప్ పరీక్షలో అతడి రక్త నమూనాల్లో నిషేధిత పదార్థం కొద్దిమొత్తంలో గుర్తించడంతో వివరణ కోరింది. అయితే ఇప్పటివరకు అభిషేక్‌పై ఎలాంటి నిషేధం విధించలేదు. 5,000, 10,000 మీటర్ల పరుగుల్లో భారత్ తరఫున బరిలోకి దిగాల్సి ఉన్న అతడి ఆసియా క్రీడల పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి.