బీహార్ రాష్ట్రం సమస్తిపూర్‌లోని సింఘియా ఘాట్‌లో వందలాంది మంది ఒకేసారి నాగపంచమి వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు SMలో వైరల్ అవుతున్నాయి. విషపూరితమైన పాములను మెడలో వేసుకుని, చేతులలో పట్టుకుని ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మిథిలా ప్రాంతంలో శతాబ్దాలుగా వస్తున్న ఈ ప్రత్యేక సంప్రదాయంలో చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుందని వారి నమ్మకం. పూజా కార్యక్రమాల అనంతరం ఆ పాములను సురక్షితంగా అడవుల్లో వదిలిపెట్టారు.