డెకాయిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత నాగవంశీ, చిత్ర నిర్మాత సుప్రియపై చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సుప్రియ తనను గతంలో సినిమాల ఖర్చు, సమయంపై క్లాసులు పీకేవారని, ఇప్పుడు ఆమె రెండు సంవత్సరాలు కష్టపడి డెకాయిట్ తీశారని, దీంతో ఆమెను వెక్కిరిస్తున్నామని నాగవంశీ నవ్వుతూ చెప్పారు. సుప్రియ 147 వర్కింగ్ డేస్ పని చేశారని, ప్రొడ్యూసర్ కష్టాలు చూపించినందుకు అడివి శేష్‌కి థాంక్స్ తెలిపారు. బయట హీరోలతో సినిమాలు తీస్తే ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.