టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన 100వ ప్రతిష్టాత్మక సినిమాను కోలీవుడ్ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. గతేడాది ప్రారంభమైన ఈ చిత్రం రహస్యంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. సమ్మర్ చివరికి షూటింగ్ పూర్తి చేసి, దసరాకు విడుదల చేయాలని నాగార్జున యోచిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'లాటరీ కింగ్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. చిత్రంలో టబు, సుస్మితా భట్ హీరోయిన్లుగా నటించనున్నారని, కథ ఆధారంగా నాగ్ మూడు వేర్వేరు గెటప్స్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది.