నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేటలో ముఖ్యమంత్రి సొంత మండలం వంగూరులో కొండారెడ్డిపల్లి మినహా ఎక్కడా రైతులకు సరైన కరెంట్ సరఫరా కావడం లేదని, రోజుకు 10 గంటలు కూడా కరెంట్ రావడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలతో రైతులు అల్లాడుతున్నారని, ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు.