రైతులకు అవగాహన కల్పించిన అధికారులు

నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలం శేరి అప్పారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు ఖేతి బచావో కార్యక్రమం నిర్వహించారు. ఎలినినో ప్రభావాన్ని ఎదుర్కోవటం, నేల సంరక్షణ, రైతు రిజిస్ట్రేషన్, కూరగాయల పంటల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఎవో తనూజరాజు, ఏ ఈవో మహేశ్వరి, హెచ్. ఈ. వో శివ లీల, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕